పొగమంచు రోడ్డును కమ్మేయడంతో ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా శివారెడ్డి పెట్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదుగురు స్నేహితులు వికారాబాద్ అనంతగిరి హిల్స్ చూసేందుకు హైదరాబాద్ నుంచి డిసెంబర్ 25వ తేదీ సోమవారం తెల్లవారుజామున కారులో బయల్దేరి వచ్చారు.
వికారాబాద్ లో తెల్లవారుజామును దట్టంగా పొగమంచుకు కుమ్ముకుని ఉండడంతో రోడ్డు సరిగా కనిపించకపోవడంతో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఐదుగురు స్నేహితుల్లో ఒకరికి ఈత రావడంతో మరో ముగ్గురిని కాపాడి బయటకి తీసుకోచ్చాడు. అయితే, మరోవ్యక్తి మాత్రం కారుతోపాటు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు... హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మిగతావారిని చికిత్స నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పూజిత, రఘు, సాగర్, మోహన్ లు క్షేమంగా బయటపడ్డారని.. గుణశేఖర్ అనే వ్యక్తి ఆచూకీ ఇంకా లభించలేని, అతని కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పొంగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక అదుపుతప్పి కారు చెరువులోకి దూసుకెళ్లినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు చెప్పారు.