హైదరాబాద్ లో ఘోరం.. పాదచారులపైకి దూసుకొచ్చిన కారు.. యువతి మృతి

హైదరాబాద్ లోని ఎల్బీ నగర్లో ఘోరం జరిగింది. వనస్థలిపురం ఎన్జీఓ కాలనీలోని వివేకానంద పార్క్ ముందు చోటు చేసుకుంది ఈ దారుణం. ర్యాష్ డ్రైవింగ్ తో ఓ కారు పాదచారుల పైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఓ యువతి మృతి చెందింది. మితిమీరిన వేగంతో కారు దూసుకురావడంతో హయత్ నగర్ కి చెందిన సోని (21) కి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సోని మృతి చెందినట్లు తెలుస్తోంది.

ర్యాష్ డ్రైవింగ్ తో యువతి ప్రాణాలు బలిగొన్న వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:-సెలవులు రద్దు చేసుకోండి