
హైదరాబాద్ కూకట్ పల్లి పీఎస్ లో ఓ రిపోర్టర్ పై కేసు నమోదు అయింది. రిపోర్టర్ కోనకంచి కృష్ణ తనను బెదిరిస్తున్నాడంటూ ఓ బిల్డర్ ఉమాశంకర్ పోలీసులకు కంప్లైట్ చేశాడు. కూకట్ పల్లి వివేకానందనగర్ లో కన్ స్ట్రక్షన్ బిల్డింగ్ లో... రిపోర్టర్ కృష్ణ ఓ ప్లాట్ బుక్ చేసుకున్నట్లు బిల్డర్ చెప్పాడు. ఐతే ప్లాట్ కు డబ్బులు ఇవ్వకుండా రిపోర్టర్ బెదిరిస్తున్నాడని బిల్డర్ ఆరోపిస్తున్నాడు. తనపై భౌతికంగా దాడి చేసే అవకాశం ఉందని పోలీసులకు కంప్లైంట్ చేశాడు బిల్డర్ ఉమాశంకర్.