మంచు విష్ణుపై నెగెటివ్​ ట్రోలింగ్..​ యూట్యూబర్‎పై కేసు నమోదు

మంచు విష్ణుపై నెగెటివ్​ ట్రోలింగ్..​ యూట్యూబర్‎పై కేసు నమోదు

బషీర్ బాగ్, వెలుగు: మా అసోసియేషన్ అధ్యక్షుడు, సినీ హీరో మంచు విష్ణును టార్గెట్ చేస్తూ నెగెటివ్ ట్రోల్స్ చేస్తున్న యూట్యూబర్ విజయ్ చంద్రహాసన్ దేవరకొండపై సినీ నటుడు, మా అసోసియేషన్ ట్రెజరర్ శివ బాలాజీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. టాలీవుడ్ నటీనటులను.. ముఖ్యంగా మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థ గురించి విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘మా’ గౌరవాన్ని దెబ్బతీసేలా తరచూ వీడియోలు క్రియేట్ చేస్తున్నాడని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో లింక్స్, ఇతర ఆధారాలను పోలీసులకు అందజేశారు. దీంతో యూట్యూబర్‎పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యూట్యూబర్‎కు నోటీసులు పంపించారు.