టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై కర్నూల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనితలపై సోషల్మీడియా వేదికగా శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె చేసిన కామెంట్లపై టీడీపీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అత్యున్నతస్థాయిలో ఉన్న వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా యూట్యూబ్, ఫేస్ బుక్ లో మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కర్నూల్ త్రీటౌన్ పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు ఫైల్ చేశారు.