![ఇస్కాన్ లోగోతో సిస్కో వెంచర్స్.. మంచిర్యాలలో ఫిర్యాదు](https://static.v6velugu.com/uploads/2025/02/a-case-has-been-registered-against-cissco-infra-developers-in-manchiryala-district_6MsUOfphj1.jpg)
మంచిర్యాల జిల్లాలో సిస్కో ఇన్ఫ్రా డెవలపర్స్ పై కేసు నమోదయ్యింది. భీమారం మండల కేంద్రంలో ఇస్కాన్ ఆలయం లోగోతో సిస్కో ఇన్ ఫ్రా సంస్థ ప్రజలను మోసగిస్తుందని ఇస్కాన్ అబిడ్స్ బ్రాంచ్ మేనేజర్ హనుమాన్ విజయ్ దాస్ జైపూర్ మండల పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇస్కాన్ ఆలయ లోగోతో వెంచర్స్ వేసి ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బెంగుళూరుకు చెందిన పాలాష్ చంద్ర దాస్, సిస్కో ఇన్ఫ్రా డెవలపర్స్ పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. విచారణ చేసి సంబంధిత వ్యక్తుల పైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏసీపీ వెంకటేశ్వర్లు.
84 ఎకరాల్లో వెంచర్
భీమారం మండలంలో దాదాపు 84 ఎకరాలతో డీటీసీపీ, లేఅవుట్ వెంచర్ ఏర్పాటు చేస్తోంది సిస్కో ఇన్ ఫ్రా డెవలపర్స్ . ఈ వెంచర్స్ లో ఫ్లాట్ తీసుకున్న వారి కుటుంబానికి ఇస్కాన్ లైఫ్ టైమ్ కార్డ్ ఇస్తుంది. ఈ కార్డ్ ద్వారా ప్రపంచంలోని అన్ని ఇస్కాన్ టెంపుల్స్ లో వీఐపీ దర్శనం, భోజన వసతి సౌకర్యం ఉచితంగా పొందవచ్చునని ప్రకటించింది.