నల్గొండ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

నల్లగొండ : నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై ఎన్నికల విధులకు ఆటంకం కలిగించినందుకు గురువారం కేసు నమోదైంది. మే 5 బుధవారం నుంచి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల లెక్కింపు నల్గొండలో జరుగుతుంది. బుధవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి  కౌటింగ్ కేంద్రంలో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించాడని ఏఆర్ఓ తిప్పర్తి పోలీస్ట్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.