ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు .. హరీశ్ రావుపై పంజాగుట్టలో కేసు

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు .. హరీశ్ రావుపై పంజాగుట్టలో కేసు

మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు అయ్యింది.  సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నాయకులు చక్రధర్ ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేశారు.

  హరీశ్ రావు,  టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు  తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చక్రధర్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హరీశ్ రావుతో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్ పై 120(B),386,409,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే..బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు, అధికారుల ఫోన్లను ట్యాప్ చేశారని  ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక అధికారులు అరెస్ట్ కాగా..నాటి ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే.