కేటీఆర్పై మరో కేసు నమోదు..ఎందుకంటే?

హైదరాబాద్ బంజారాహిల్స్ పీఎస్ లో కేటీఆర్ పై కేసు నమోదయ్యింది. అనుమతి లేకుండా   ఏసీబీ ఆఫీస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించినందుకు 221,292,126(2),r/w 3(5) BNS  సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు  పోలీసులు. కేటీఆర్ తో పాటు మరో  ఐదుగురు   బాల్కన్ సుమన్ ,
మన్నె గోవర్ధన్ ,జయసింహ , క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు.  ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

ఫార్ములా ఈ రేస్ కేసులో  జనవరి 9న కేటీఆర్ ను ఏసీబీ అధికారులు  దాదాపు 7 గంటల పాటు విచారించారు. విచారణ తర్వాత ఏసీబీ ఆఫీస్ నుంచి బంజారాహిల్స్ లోని బీఆర్ఎస్ ఆఫీస్ వరకు కేటీఆర్ ర్యాలీగా వెళ్లారు.  అనుమతి లేకుండా ర్యాలీ తీసి వాహనదారులకు ఇబ్బంది కల్గించడమే గాకుండా..ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు కేటీఆర్ పై ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. 

Also Read :- ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ అంటే ఇదీ

జనవరి 9న  విచారణ తర్వాత బయటకు వచ్చిన కేటీఆర్.. ఏసీబీ ఆఫీస్ దగ్గర మాట్లాడుతుండగా అడ్డుకున్నారు  డీసీపీ.రోడ్డుపై  మాట్లాడొద్దని.. పార్టీ ఆఫీస్ కు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకోవాలని కేటీఆర్ కు  సూచించారు. దీంతో  మీడియాతో మాట్లాడితే మీకెందుకు భయమని డీసీపీపై కేటీఆర్ రుసరుసలాడారు.