
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై సిద్దిపేట త్రీ టౌన్ పీఎస్లో ఎన్నికల నిబంధన ఉల్లంఘన కేసు కేసు నమోదైంది. ఐకేపీ, ఈజీఎస్ ఉద్యోగులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో ఎంపీ అభ్యర్థితోపాటు మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. నిన్న పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో వెంకటరామ్ రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారు. దాదాపు అర్ధరాత్రి వరకు ఈ భేటీ సాగింది.
విషయం తెలుసుకుని కాంగ్రెస్, బీజేపీ నాయకులు అక్కడికి వెళ్లారు. దీంతో వెంకటరామిరెడ్డి తో పాటు ఉద్యోగులు అక్కడి నుంచి పరారయ్యారు. సిద్దిపేట నియోజకవర్గంలోని తనతో వ్యక్తిగతంగా పరిచయం ఉన్న దాదాపు 150 మంది ఉద్యోగస్తులను పిలిచి వారితో విందు సమావేశాన్ని వెంకటరామిరెడ్డి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎలక్షన్ అధికారులకు బీజేపీ , కాంగ్రెస్ నేతల ఫిర్యాదు చేశారు. ఎన్సీసీ టీం సభ్యులు అక్కడికి చేరుకునేసరికి వీరంతా వెళ్లిపోయారు.