పెద్దపల్లి బీఆర్ఎస్ లీడర్ గోగుల రవీందర్ రెడ్డిపై కేసు నమోదు

 పెద్దపల్లి బీఆర్ఎస్ లీడర్ గోగుల రవీందర్ రెడ్డిపై కేసు నమోదు

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీపై సోషల్ మీడియాలో తప్పుడ ప్రచారాలు చేస్తున్నారని.. జైపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. దీనిపై విచారణ చేసిన పోలీసులు గోగుల రవీందర్ రెడ్డి అనే బీఆర్ఎస్ లీడరే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసినట్లు గుర్తించారు. రవీందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని మంచిర్యాల ఏసీపీ హెచ్చరించారు. కాగా రేపు దేశవ్యాప్తంగా నాలుగో దశ లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.