![సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో రఘునందన్ రావుపై కేసు నమోదు](https://static.v6velugu.com/uploads/2024/04/a-case-has-been-registered-against-raghunandan-rao-in-sangareddy-police-station_rOpqfZA2hk.jpg)
బీజేపీ లీడర్, మెదక్ ఎంపీ క్యాండిడేట్ రఘునందన్ రావు పై కేసు నమోదైంది. ఎమ్మెల్యే హరీశ్ రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన సహా అనుచిత వ్యాఖ్యలు చేశారని సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రఘునందన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. మెదక్ ఎంపీ బరిలో బీఆర్ఎస్ నుంచి వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీజేపీ నుంచి రఘునందన్ పోటీలో ఉన్నారు.