ఆస్తి కోసం దాడి..కానిస్టేబుల్​పై కేసు

జూబ్లీహిల్స్, వెలుగు : ఆస్తి కోసం అత్తింటి వారిపై దాడి చేసిన కానిస్టేబుల్ పై కేసు నమోదైంది. లంగర్​హౌస్ పీఎస్​లో ఎండీ షాహిద్​ఖాన్ కానిస్టేబుల్. కొద్దిరోజులుగా ఆస్తిలో తనకు కూడా వాటా ఇవ్వాలని జూబ్లీహిల్స్​ఇందిరానగర్​లోని తన బామ్మర్ది అబ్దుల్​వాహిద్​పై దాడికి పాల్పడ్డాడు. 

వాటా ఇవ్వకపోతే కుటుంబసభ్యుల అంతు చూస్తానని బెదిరించాడు. దీంతో కానిస్టేబుల్​షాహిద్​తో తమకు ప్రాణ హాని ఉందని బాధితుడు అబ్దుల్​వాహిద్​జూబ్లీహిల్స్​పీఎస్​లో బుధవారం ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.