‘భార్యకు అబార్షన్, మృతి’ కేసులో ఏడుగురిపై కేసు నమోదు 

సూర్యాపేట, వెలుగు : తన భార్య కడుపులో ఆడపిల్ల ఉందని ఆర్ఎంపీతో అబార్షన్​చేయించి ఆమె చావుకు కారణమైన భర్తతో పాటు మరో ఆరుగురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్టు సూర్యాపేట సీఐ రాజశేఖర్ తెలిపారు. చివ్వెంల మండల పరిధిలోని ఎంజీ నగర్ తండాకు చెందిన హరి సింగ్ ఈమె భార్య సుహాసినికి ఇద్దరు బిడ్డలు. సుహాసిని మూడోసారి గర్భం దాల్చగా స్కానింగ్​లో మళ్లీ ఆడపిల్ల అని తేలింది.

ఏడు నెలల కడుపుతో ఉన్నా కూడా హుజుర్ నగర్ లోని కమల దవాఖానలో ఆర్ఎంపీతో సుహాసినికి అబార్షన్ చేయించాడు. ఆపరేషన్​వికటించి ఆమె చనిపోయింది. ఈ కేసులో భర్త హరిసింగ్​తో పాటు మృతురాలి అత్త, ఇద్దరు ఆడపడుచులు, ముగ్గురు కమల దవాఖాన యాజమానులపై కేసు నమోదు చేశారు.  కేసును చివ్వెంల పీఎస్​కు బదిలీ చేశారు.