కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై కేసు నమోదైంది. హైదరాబాద్ మొఘల్ పురా పోలీసు స్టేషన్ లో పీసీసీ వైఎస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఢిల్లీలో ఎన్నికల ప్రధాన అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల1వ తేదీన పాతబస్తీ పర్యటన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ బ్రేక్ చేశారని చెప్పారు. అమిత్ షా ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్ పై కమలం పువ్వు గుర్తు ఉందని ఇద్దరు చిన్నారుల చేతిలో ఆప్ కీ బాత్ 400 సీట్స్ అంటూ రాసి ఉందని ఇది ఎలక్షన్ రూల్స్ కి విరద్ధమని చెప్పారు.
ఎన్నికల నియమాలను బీజేపీ పట్టించుకోలేదనని చిన్నారులతో ప్రచారం చేయించారని కంప్లైంట్ చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవి లత మాట్లాడే సమయంలో కొంత మంది మైనర్ బాలికలను తన వద్దకు రమ్మంటు అమిత్ షా సైగ చేయడంతో చిన్నారులు అమిత్ షా వద్దకు వెళ్లారని తెలిపారు. ఫిర్యాదు పై స్పందించిన ఈసీ జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ను ఆదేశించారు.
సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహారాకు ఆదేశాలు జారీ చేశారు. మొఘల్ పురా పోలీసులు విచారణ చేసి క్రైం నెంబర్ 77/2024 . సెక్షన్ 188 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. A1గా యమాన్ సింగ్, A2గా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవి లత, A3 గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. A4గా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి A5గా MLA రాజసింగ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.