హైదరాబాద్ : సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు, అతని అనుచరులపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు, అతని అనుచరులైన శ్రీకాంత్ నాథని (కోడి కూర చిట్టి గారే యజమాని), వెంకటేష్, అక్బర్ తో పాటు 60 మంది వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. జేసీబీతో ఇన్ఫినిటీ గేట్లు సరిహద్దులను బద్దలు కొట్టి.. బలవంతంగాలోనికి ప్రవేశించారన్న అభియోగాలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
ఇన్ఫినిటీ డ్రైవ్ యజమాని శ్రీనివాస్‌రావు, అతని కుమారుడు వెళ్తుండగా జేసీబీతో కారును ఢీకొట్టి.. దాడికి ప్రయత్నించారనే ఫిర్యాదుపై కేసులు నమోదయ్యాయి. జూన్ 8వ తేదీన 100 డయల్ నెంబర్ కు ఇన్ఫినిటీ డ్రైవ్ యజమాని శ్రీనివాస్‌రావు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో సంధ్య కన్వెన్షన్ కు చెందిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడ్డ మరి కొంతమంది పరారయ్యారు. ఈ ఘటన జూన్ 8వ తేదీ రాత్రి 10 గంటల30 నిమిషాల సమయంలో జరిగినట్లు చెబుతున్నారు పోలీసులు. జూన్ 9న సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై గచ్చిబౌలి పోలీసులు FIR నమోదు చేశారు.