ఫోన్ ట్యాపింగ్ కేసులో నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు అయ్యారు. ఈ కేసులో ప్రధాన నింధితుడు తిరుపతన్నతో బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్య చాలా సార్లు మాట్లాడినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ లో ఉంది. మునుగోడు బై పోల్ సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అనుమానాలు ఉన్నాయి. ఈక్రమంలోనే ఆయన్ని ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫస్ట్ టైం ఓ రాజకీయ పార్టీకి సంబంధం ఉన్న నేతను పోలీసులు విచారిస్తున్నారు.
Also Read:-లెక్కలు తీస్తే వాళ్ళ బొక్కలు ఇరుగుతవి
విచారణ తర్వాత ఎలాంటి విషయాలు బయటకు వస్తాయని ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ కేసు సంచలనంగా మారింది. చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత మరి కొంతమందికి నోటీసులు అందే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నలుగురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఉమ్మడి నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పలువురిపై ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సందేహాలు వస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాలో కొందరికి సిట్ నోటీసులు పంపనున్నట్లు సమాచారం.