సంతోష్ రావు తండ్రి రవీందర్ రావు పై కేసు నమోదు

కరీంనగర్, వెలుగు : ఓ యూట్యూబ్  చానెల్ లో తనకు, మంత్రి పొన్నం ప్రభాకర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయించారని కూస రవీందర్  అనే వ్యక్తి  ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు తండ్రి రవీందర్ రావు, మరో నలుగురిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. మిడ్ మానేరు భూనిర్వాసితుల‌‌‌‌ ప్లాట్లను పొన్నం ప్రభాకర్ అండతో తాను కబ్జా చేసినట్లు ఆ చానెల్ లో చిలుక ప్రవీణ్ అనే వ్యక్తి ప్రచారం చేసి తమ పరువుకు భంగం కలిగించాడని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. జోగినిపల్లి రవీందర్ రావు ప్రోత్సాహంతోనే ప్రవీణ్  మాట్లాడారని ఆయన చెప్పారు. ఆయనతో పాటు మరో నలుగురు తనను కబ్జాదారుడిగా చిత్రీకరించారని పేర్కొన్నారు.