Video Viral: వామ్మో.. ఆ షాపింగ్​ మాల్​ లో సెక్యూరిటీ గార్డ్​గా పిల్లి....

Video Viral:  వామ్మో.. ఆ షాపింగ్​ మాల్​ లో సెక్యూరిటీ గార్డ్​గా పిల్లి....

ప్రతి షాపింగ్​మాల్​ లో బయట సెక్యూరిటి గార్డ్​లు ఉంటారు.  షాపు నుంచి బయటకు వచ్చే వారిని ... వారు తీసుకున్న లగేజీని.. బిల్​ను  పరిశీలించి పంపుతారు.. ఇక కోట్ల రూపాయిలు టర్నోవర్​ కలిగిన షాపుల్లో అయితే  డాగ్స్​ కూడా ఉంటాయి.  ఎందుకంటే ఒక్కోసారి కొంతమంది అక్కడున్న సెక్యూరిటీ గార్డ్​ల కళ్లుగప్పి వెళ్లే అవకాశం ఉంది.  కాని ఇప్పుడు ఓ షాపింగ్​ మాల్​ లో పిల్లి సెక్యూరిటి గార్డ్​ జాబ్​ చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది. .. వివరాల్లోకి  వెళ్తే 

వైరల్​ అవుతున్న వీడియోలో   ఫిలిప్పీన్స్‌లోని ఓ మాల్‌లో  ఓ పిల్లికి సెక్యూరిటీ గార్డ్ జాబ్  చేస్తుంది. .. సెక్యూరిటీ సిబ్బందితో  సమానంగా విధులు నిర్వహిస్తోంది.  మనుషులైనా అలసత్వం వహిస్తరేమో కాని పిల్లి చేసే పనుల్లో అలసత్వమే  కనపడటం లేదు.  ప్రస్తుతం ఈ పిల్లి విధులు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ పిల్లిని మాండలుయోంగ్ మెట్రో మనీలాలోని మాల్‌లో మెగావరల్డ్ కార్పొరేట్ సెంటర్ సెక్యూరిటీ జాబ్లో నియమించింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Almost (@almost.co)

ఆల్ డే సూపర్ మార్కెట్లోని గేట్ వద్ద సెక్యూరిటీ డ్యూటీ చేస్తుంది. దీనికి కోనన్​ అని పేరు పెట్టారు. అంతేకాకుండా.. కోనన్ బ్యాగ్‌లను తనిఖీ చేయడంలో సెక్యూరిటీ సిబ్బందికి సాయపడుతుంది. ఎవరైనా మాల్‌కి పెంపుడు జంతువులను తెచ్చుకుంటే వాటిని కూడా స్వాగతిస్తుంది ఈ పిల్లి. మాల్‌లో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందిలో భాగమైపోయిన ఈ పిల్లి వయస్సు.. 6 నెలలు. తాను చేసే పనే కాకుండా.. సెక్యూరిటీ సిబ్బంది చేసే పని ఒత్తిడిని తగ్గిస్తోంది ఈ పిల్లి. దీనిని సెక్యూరిటీ గార్డ్ కోనన్ అని పిలుస్తారు. అయితే.. ఈ పిల్లి పనితీరును చూసిన కొంత మంది.. తమ మాల్స్ లో కూడా పిల్లులను పనిలో పెట్టుకోవాలని చూస్తున్నారు.

కుక్కలు పెంచుకుంటే మనకు రక్షణ ఇస్తాయి అని తెలుసు.. ఎవరైనా కొత్త వారు ఇంట్లోకి వస్తే అరిచి, వారిని ఇంట్లోకి రాకుండా చేస్తుంది. అలాగే కుక్కలతో పాటు.. పిల్లులను కూడా పెంచుకుంటారు. అవి.. ఇంట్లో ఉన్న ఎలుకలను ఎప్పటికప్పుడు చంపి తినేస్తాయి. పిల్లులను ఎక్కువగా ఎలుకల బెడద నుంచి రక్షించేందుకు మాత్రమే పెంచుకుంటారని తెలుసు.. కానీ ఓ మాల్లో పిల్లి సెక్యూరిటీ గార్డ్ అవతారమెత్తింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో కలిసి పని చేస్తోంది.