ఢిల్లీ: బతికుండగానే భార్యలు నరకం చూపిస్తున్నారని భర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పునీత్ ఖురానా ఆత్మహత్యపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పునీత్ ఖురానాకు, అతని భార్య మనీకా పహ్వాకు మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ సీసీ టీవీ కెమెరాల్లో వీడియోతో పాటు ఆడియో కూడా రికార్డ్ అయింది.
ఈ సీసీటీవీ ఫుటేజీలో మనీకా అతని భర్తను ఎంత వేధించిందో స్పష్టంగా తెలిసింది. అమ్మ నా బూతులు తిడుతూ.. నానా రచ్చ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇప్పటికే 15 నిమిషాల కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బెంగళూరులో అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న నెలల వ్యవధిలోనే భార్య వేధింపులతో పునీత్ ఖురానా చనిపోవడం గమనార్హం.
ALSO READ | పోలీస్ అయితే ఏంటీ.. పోలీస్ జీపు అయితే ఏంటీ: ఓ తాగుబోతు వీరంగం మామూలుగా లేదు..!
ఢిల్లీలో ఫేమస్ అయిన వుడ్‌బాక్స్ కేఫ్ సహ వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా(40) భార్య వేధింపులు భరించలేక మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. మోడల్ టౌన్‌లోని కళ్యాణ్ విహార్ ఏరియాలో ఉన్న ఇంటిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. మనికా జగదీశ్ పహ్వా అనే మహిళతో కలిసి పునీత్ ఖురానా ఢిల్లీలో వుడ్‌బాక్స్ కేఫ్ ప్రారంభించాడు. వీరిద్దరూ 2016 లో పెండ్లి చేసుకున్నారు. అయితే, వైవాహిక సమస్యలతో పాటు బిజినెస్‌కు సంబంధించిన విబేధాలతో దంపతులిద్దరూ తరచూ గొడవ పడేవారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
ఈ వివాదాల నేపథ్యంలో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పునీత్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని.. అందులో దంపతుల గొడవకు సంబంధించిన16 నిమిషాల నిడివి గల కాల్ రికార్డింగ్ ఉందని వివరించారు. వ్యాపార ఆస్తుల విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ జరిగినట్లు ఆధారాలు కూడా లభించాయని చెప్పారు. పునీత్ ఖురానా ఆత్మహత్య కేసులో ఆయన భార్య మనికా జగదీశ్ పహ్వాను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. దర్యాఫ్తు కొనసాగుతున్నదని పేర్కొన్నారు. భార్య, ఆమె తల్లిదండ్రులు పెట్టే టార్చర్ వల్లే పునీత్ ఖురానా సూసైడ్ చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు.
#PuneetKhurana did not commit suicide just because being humiliated on a late night phone call by his wife. This harassment and extortion was going on since long. Suicide is never easy. Suicide is never a choice for anyone. Its the extreme helplessness which turns people… pic.twitter.com/ip69yCS4Bd
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) January 1, 2025