సూర్యాపేట జిల్లాలో సిమెంట్ లారీ దగ్ధం

సూర్యాపేట జిల్లా కోదాడ జాతీయ రహదారి 65పై సిమెంట్ లారీ దగ్ధమైంది. ఈ ఘటన మునగాల మండలం ఆకుపాముల గ్రామం వద్ద జరిగింది. కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ నుండి హైదరాబాద్ కు లోడుతో వెళ్తున్న ఒక లారీ.. ఆకుపాముల పరిధిలోకి రాగానే ఒక్కసారిగా క్యాబిన్ లో నుండి మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే డ్రైవర్ లారీ నుంచి బయటకు దూకి ప్రాణం దక్కించుకున్నాడు. విషయం తెలియగానే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుంది. మంటలు అదుపు చేయడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది.