బూసరాయిని సందర్శించిన సెంట్రల్ టీమ్

గుండాల, వెలుగు :  ఆళ్లపల్లి మండల కేంద్రంలోని  బూసరాయి గ్రామాన్ని   డీఎంహెచ్ ఓ ఆదేశాల మేరకు బుధవారం సెంట్రల్ ఢిల్లీ బృందం సందర్శించి వైద్య శిబిరం ఏర్పాటుచేసింది.  ఈ సందర్భంగా డాక్టర్లు మలేరియా మాస్ స్క్రీనింగ్ టెస్టులు,చిన్న పిల్లలకు టీకాలు   వేశారు.

సీజనల్ వ్యాధుల పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ స్పందన,  అదనపు మలేరియా అధికారి డాక్టర్ గొంది వెంకటేశ్వర్లు, డీఐఓ  డాక్టర్ బాలాజీ నాయక్, అల్లపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేవంత్, ఉలవనూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తేజస్విని, ఐ కే ఏం ఆర్ ఢిల్లీ టీమ్ పాండీ , మనీష్ , నవీన్, సబ్ యూనిట్ అధికారులు  పాల్గొన్నారు.