న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థలో చేపట్టే నియామకాల్లో బంధుప్రీతికి బ్రేక్వేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. న్యాయమూర్తుల బంధువులు హైకోర్టు జడ్జిలుగా అపాయింట్కాకుండా అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్నది. జడ్జిల రిలేషన్స్హైకోర్టు జడ్జిలుగా నియమితులై.. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వస్తున్నారంటూ ఇప్పటికే కొలీజియం కామెంట్ చేసింది. ఈ నేపథ్యంలో ఓ సీనియర్జడ్జి ప్రతిపాదన మేరకు ఈ సంప్రదాయానికి స్వస్తి పలికేందుకు కొలీజియం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నదని సమాచారం.
హైకోర్టు లేదా సుప్రీంకోర్టులోని రిటైర్డ్, సిట్టింగ్‌జడ్జి తన కుటుంబంలోని ఏ సభ్యుడి పేరునూ జడ్జి పోస్ట్‌కు సిఫారసు చేయరాదనే కండిషన్పెట్టనున్నట్టు తెలిసింది. కొలీజియంలోని న్యాయమూర్తులు దీనికి అంగీకరిచినట్టు సమాచారం. ఇది ఒకవేళ ఆమోదం పొందితే.. అర్హత ఉన్నా కొందరికి ఈ నిబంధన కారణంగా జడ్జి పోస్ట్ దక్కకపోయే అవకాశం ఉన్నదనే వాదన వినిపిస్తున్నది.