విద్యార్థి సంఘాల ఎన్నికలతో వారసత్వ రాజకీయాలకు చెక్

రాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి మొదలుకొని ప్రధానుల వరకు యూనివర్సిటీలు మంచి నాయకులను అందించాయి. ఉమ్మడి ఆంధ్రాతో  పాటు దేశ వ్యా ప్తంగా ఎంతో మందిని సీఎంలుగా అందించిన ఘనత వర్సిటీలది. పీవీ, చంద్రబాబు,  లాలూ ప్రసాద్ వంటి ప్రముఖ నాయకుల నుంచి మొదలుపెడితే నేటి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా విద్యార్థి నాయకుడిగా ఎదిగివచ్చిన వారే.  యూనివర్సిటీలు దేశంలో ఎంతో మంది ఉన్నతమైన వ్యక్తులను రాజకీయాలకు పరిచయం చేశాయి.  కానీ నేటి ఆధునిక సమాజంలో అలాంటి అవకాశం లేకుండా పోయింది. వర్సిటీల్లో విద్యార్థి సంఘాలకు ఎన్ని కలు నిర్వహించడం లేదు. దీంతో విద్యా వంతులైన పౌరులు కేవలం ఉద్యోగం, వ్యాపారం,  లేదా కార్పొ రేట్ కొలువులకే పరిమితం అవుతున్నారు. అందుకే రాజకీయ రంగంలో ఏమాత్రం నాయకత్వ లక్షణాలు లేకుండా పోతున్నాయి. సమస్యను అధిగమించే ఆలోచనలకు దూరంగా ఉంటూ, సమాజ నిర్మా ణం, సామాజిక స్పృహ, వ్యవస్థపైనా, పాలనరంగంపైనా , ఎలాంటి అవగాహన లేని విద్యా వంతులు తయారవుతున్నారు.

చట్టసభల్లో విద్యావంతులు ఉండాలె

ఎన్నో భిన్న విభిన్న ఆలోచనలకు, సంఘర్షణలకు, చర్చలకు, వాదోపవాదాలకు, సిద్ధాంతపరమైన ఆలోచనలకు కేంద్రబిందువులుగా ఉండాల్సిన వర్సిటీలు నేడు కేవలం, ప్రభుత్వ ఉద్యోగ సాధన కోసం లేదా వ్యక్తిగత ప్రయోజనాలకు అవసరమైన కార్పొ రేట్ ఆలోచనలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలే ఇందుకు కారణం. ఉన్నత విద్యా వంతులను,  పరిశోధకులను తయారు చేస్తూ  దేశ ఉన్నతికి పాటుపడాల్సిన వర్సిటీలు నేడు కనీస వసతులు కూడా లేక కొట్టుమిట్టాడుతున్నాయి. బోధన, బోధనేతర సిబ్బందిలేక, తరగతులు సక్రమంగా జరగడం లేదు. విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘాలకు ఎన్ని కలు నిర్వహించకపోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఉన్నత విద్యా సంస్థల్లో  నాయకులుగా అవతరిస్తే తర్వాత వారు ప్రజా క్షేత్రంలోనూ ప్రజల అవసరాలను అవగాహన చేసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేయగలుగుతారు. చట్టసభల్లో నిష్ణాతులైన విద్యావంతులు ఉంటే తప్పక మంచి చట్టాలు రూపుదిద్దుకుంటాయి.  ప్రజలకు న్యాయం జరుగుతుంది. 

వారసత్వ రాజకీయాలు

విద్యార్థి సంఘాల నుంచి బలమైన నాయకత్వం రాకపోవడం వల్ల ప్రస్తుత రాజకీయాలు వారసత్వ పోకడలో నడుస్తున్నాయి.  ఒకే కుటుంబం, వర్గం చేతుల్లో అధికారం కేంద్రీకృతమవుతున్నది. రాజకీయాలు వ్యాపారపరమైన పెట్టుబడిగా మారుతున్నాయి. ఆశ్చర్యకరం ఏమిటంటే కేంద్ర, రాష్ట్రాల చట్టసభల్లోకి, ప్రజలు తిరస్కరించిన, రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిన వ్యక్తులు కూడా వెళ్తున్నారు.  అసలు పెద్దల సభలో నేడు ఎవరూ కూడా వివిధ రంగాల నుంచి వచ్చిన వారు కానీ, సమాజ శ్రేయస్సు కోసం జీవితాలు త్యా గం చేసిన పెద్దలు గానీ ఎవరూ లేరు. రాష్ట్రంలో శాసనమండలి, కేంద్రంలో రాజ్యసభ  రాజకీయ నిరుద్యోగుల సభలుగానే  నిలుస్తున్నాయంటే అతిశయోక్తికాదు. 

ప్రజాసమస్యలపై చర్చ ఏది?

అసెంబ్లీ, పార్లమెంట్​ సమావేశాలు అధికార, ప్రతిపక్షాలు రాజకీయ వ్యతిరేక నినాదాలు చేసుకునే చోటుగా మారాయి. సమావేశాల్లో ప్రజా సమస్యల ప్రస్తావన కంటే వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రధాన ఆకర్షణగా భావించే భావదారిద్య్రం, దుస్థితి నేటి రాజకీయాల్లో నెలకొంది. దీనికి ప్రధాన కారణం డబ్బు రాజకీయాలు. సమాజ శ్రేయస్సుకు, ప్రజాసంక్షేమం కోసం మంచి లక్షణాలు, సత్ప్రవర్తన, రాజకీయ విలువలు గల నాయకులు కొంత మందియైనా ఉండాలి. అలా ఉండాలంటే విశ్వవిద్యాలయాల్లో ఎన్ని కలు నిర్వహించి భవిష్యత్తు నాయకత్వా న్ని రూపుదిద్దాల్సి న కనీస బాధ్యత ప్రభుత్వాలు మరియు సమాజ శ్రేయస్సును కాంక్షించే ప్రతి ఒక్కరు దీన్ని గుర్తించాలి. నూతన నాయకత్వా న్ని విధానాల పరంగా తయారు చేయాల్సి న అవసరం ఎంతైనా ఉంది. ప్రజలకు ప్రభుత్వాలకు దూరం పెరిగింది. దానికి కారణం నాయకులు కేవలం ఓట్లప్పు డు తప్ప మిగతా కాలంలో ఏనాడు నియోజకవర్గంలోని ప్రాంతాలు పెద్దగా పర్యటించక పోవడం, సమస్యలను గుర్తించి పరిష్కరించక పోవడం. అదేవిధంగా మోస పోవడం ప్రజల వంతవడం ఒక చక్రంగా జరుగుతున్న ప్రక్రియ్ర . అందుకే విశ్వవిద్యాలయాల నుంచి విద్యా ర్థి నాయకులుగా, సమాజ సేవకులుగా తిర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధమైన ఆలోచనకై మేధావులు, విద్యా వంతులు, ప్రభుత్వాలు, సమాజ శ్రేయ స్సు ను కాంక్షించే ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సి న అవసరం ఎంతైనా ఉంది.

– కె.రమేశ్ యాదవ్, ఓయూ