కామారెడ్డి జిల్లాలో రైతుపై చిరుత దాడి

  • గాయపడిన రైతు
  • బాన్సువాడ దవాఖానకు తరలింపు 
  • బీర్కూర్​ మండలం బరంగెడ్గి శివారులో ఘటన 

బీర్కూర్​, వెలుగు: కామారెడ్డి జిల్లా బీర్కూర్​ మండలం బరంగెడ్గి శివారులో శుక్రవారం రైతుపై చిరుత దాడి చేసింది. గ్రామస్తుల కథనం ప్రకారం..బరంగెడ్గి గ్రామానికి చెందిన యువ రైతు విజయ్​కుమార్​(19) మంజీరా శివారులో ఉన్న తన పొలంలోని నారుమడికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు.

అయితే, అప్పటికే అక్కడ ఉన్న చిరుత విజయ్​పై దాడి చేసింది. దీంతో గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల ఉన్న రైతులు అరుస్తూ అక్కడికి చేరుకున్నారు. దీంతో చిరుత పారిపోయింది. గాయపడిన విజయ్ కుమార్​ను బాన్సువాడ గవర్నమెంట్ హాస్పిటల్​కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. గ్రామస్తులు ఫారెస్టు ఆఫీసర్లకు సమాచారం అందించారు