హమ్మయ్యా... ఎట్టకేలకు చిరుత చిక్కింది.

హమ్మయ్యా...  ఎట్టకేలకు చిరుత చిక్కింది.

ఐదు రోజుల నుంచి అటవీశాఖ అధికారులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది.  మేకను ఎరగా వేయగా తినేందుకు బోనులోకి వచ్చి చిక్కుకుపోయింది.  కాసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి చిరుతను నెహ్రూ జూ పార్క్ తరలించనున్నారు అధికారులు. వైద్య పరీక్షలు నిర్వహించి ఒకరోజు పాటు చిరుతను పర్యవేక్షణలో ఉంచనున్నారు జూ అధికారులు.  ఆ తర్వాత నల్లమల అడవిలో వదిలేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.  చిరుతు చిక్కడంతో  ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు  ఊపిరి పిల్చుకున్నారు.  

శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ రన్ వేపై ఇటీవల చిరుత కనిపించి కలకలం సృష్టించింది. రన్‌‌‌‌‌‌‌‌వేపై చిరుతను గమనించిన పెట్రోలింగ్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ అధికారులు అటవీ శాఖకు సమాచారం అందించారు.  దీంతో చిరుతను పట్టుకునేందుకు గత ఐదు రోజుల నుంచి అధికారులు గస్తీ ఆపరేషన్‌ నిర్వహించారు. చిరుత ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు ఎయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతాల్లో 25 అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 

చిరుతను పట్టుకునేందుకు మేకలను ఎరగా వేసి 5 బోన్లను ఏర్పాటు చేశారు.  మేక కోసం చిరుత బోన్‌ దగ్గరకు వెళ్లినా దానిపై దాడి చేయలేదు.  5 రోజులుగా బోన్ వరకు వచ్చి చిక్కకుండా వెళ్లిపోతుంది చిరుత. ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.