ఉప్మా వద్దు బిర్యానీ కావాలి

ఉప్మా వద్దు బిర్యానీ కావాలి

అంగన్​వాడీలో వడ్డించాల్సిందిగా అడిగిన చిన్నారి

కొచ్చి: కేరళలో ఒక పిల్లాడు అంగన్​వాడీలో తనకు ఉప్మాకు బదులుగా బిర్యానీ వడ్డించాలని అడిగిన వీడియో వైరల్ అయింది. అది ఆ రాష్ట్రంలోని అంగన్‌‌వాడీలలో వడ్డించే ఫుడ్ మెనూను మార్చేందుకు కారణమైంది. శంకు అని పిలుచుకునే రిజుల్ ఎస్.సుందర్ అనే చిన్నారి అంగన్‌‌వాడీలో ఉప్మాకు బదులుగా “బిర్నానీ” (బిర్యానీ), “పోరిచా కోయి” (చికెన్ ఫ్రై) పెట్టాలని తనను కోరుతున్న వీడియోను అతని తల్లి ఇన్‌‌స్టాలో షేర్ చేసింది. 

వాళ్ల ఇంట్లో చేసిన బిర్యానీ తింటూ శంకుకు ఈ మాటలు మాట్లాడాడు. వైరల్​గా మారిన ఈ వీడియో కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ​దృష్టికి వెళ్లడంతో ఆమె తన ఫేస్​బుక్ పేజీలో పోస్ట్ చేశారు. అలాగే అంగన్‌‌వాడీలలో పిల్లలకు అందించే మెనూను సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆమె పేర్కొన్నారు. “పిల్లలకు పోషకాహారం అందించడానికి అంగన్‌‌వాడీల ద్వారా వివిధ రకాల ఫుడ్ అందిస్తున్నం. ఇప్పటికే గుడ్లు, పాలు అందిస్తున్నం” అని ఆమె అన్నారు.