
గూడూరు, వెలుగు: నీటి తొట్టెలో పడి చిన్నారి మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. గూడూరు మండలం పడమటి తండాకు చెందిన తేజావత్ సుమన్, వెన్నెల దంపతుల రెండో కుమార్తె పుష్ప(3) బుధవారం ఆడుకుంటూ వెళ్లి ఇంటిముందు నీటి తొట్టెలో పడింది. కొద్దిసేపటికి పుష్ప కనిపించకపోవడంతో తల్లి ఇంట్లో వెతుకుతూ.. నీటి తొట్టెలో చూడగా చిన్నారి మృతిచెంది ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్ఐ గిరిధర్ రెడ్డి తెలిపారు.