
- భువనగిరి డంపింగ్ యార్డులో కూలిన శిలాఫలకం
- పదేండ్ల పాప మృతి
- మూడేండ్ల చిన్నారికి గాయాలు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ డంపింగ్‌యార్డులో చెత్త ఆటో ఢీకొనగా శిలాఫలకం మీద పడి ఓ చిన్నారి చనిపోయింది. తమిళనాడుకు చెందిన కార్బన్ డైనమిక్స్ అనే ఏజెన్సీ ఇటీవలే భువనగిరి డంపింగ్ యార్డులో చెత్తను వేరు చేసే పనిని చేపట్టింది. ఇక్కడ పనులు చేయడానికి అసోం నుంచి రెండు కుటుంబాలను భువనగిరికి రప్పించారు. ఇందులో అశ్ర, అలీ దంపతులు ఇద్దరు ఆడపిల్లలతో వచ్చారు. వీరు డంపింగ్‌యార్డులోనే ఉంటున్నారు.
కాగా, గురువారం శంకుస్థాపన టైంలో వేసిన శిలాఫలకం వెనుక పిల్లలు ఆడుకుంటున్నారు. అదే టైంలో చెత్త ఆటో రివర్స్తీస్తూ శిలాఫలకాన్ని ఢీకొట్టగా అది కూలింది. దీంతో పిల్లలపై పడగా అప్సాన అహ్మద్(10) అక్కడికక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడిన మునీర్ మరియ(3)ను గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఆటో డ్రైవర్సురేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.