భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామంలో శనివారం రాత్రి డెంగ్యూతో ఓ చిన్నారి చనిపోయింది. గ్రామానికి చెందిన విజయ్, అనిత దంపతుల కూతురు రోహిత(4) కు డెంగ్యూ జ్వరం వచ్చింది.
నాలుగు రోజులుగా హనుమకొండలోని ప్రైవేట్ హాస్పిటల్లో ఆమెకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రాత్రి పరిస్థితి విషమించి చిన్నారి మరణించింది.