- మేడ్చల్ పీఎస్ పరిధిలో ఘటన
మేడ్చల్, వెలుగు: వాటర్ ట్యాంకర్ ఢీకొని చిన్నారి చనిపోయిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దనావత్ నగేశ్ వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం మేడ్చల్ చెక్ పోస్ట్ వైపు ట్యాంకర్‌తో వెళ్తున్నాడు. వెహికల్ ను ఓవర్ స్పీడ్ తో నడపడంతో అదే ఏరియాలోని ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న ఆద్య(3) అనే చిన్నారిని ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదంలో చిన్నారి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. డెడ్ బాడీని పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.
కారు ఢీకొని మరొకరు..
శామీర్ పేట: బైక్ ను కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి చనిపోయిన ఘటన శామీర్ పేట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కొల్తూరు గ్రామానికి చెందిన పులకంటి సంజీవ(37) మంగళవారం శామీర్‌పేట నుంచి కొల్తూరు వైపు బైక్ పై వెళ్తున్నాడు. వివేకానంద విగ్రహం వద్ద ఓవర్ స్పీడ్ తో వచ్చిన ఓ కారు అతడి బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంజీవ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.