
కౌడిపల్లి, వెలుగు : ఈదురు గాలులకు ఇంటి పైకప్పుతో పాటు గాలిలో ఎగిరిపోయి పక్కింటి స్లాబ్‌పై పడ్డ చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేట జాజి తండాలో సోమవారం రాత్రి బలమైన ఈదురు గాలులు వీయడంతో మాలోత్ మాన్సింగ్ఇల్లు ధ్వంసమైంది. ఇంటి పైకప్పు రేకులతో పాటు అతడి కూతురు సంగీత (3) గాలిలో ఎగిరి పక్కనే ఉన్న మరో బిల్డింగ్ స్లాబ్‌పై పడిపోయింది. దీంతో ఆ పాప నోరు, ముక్కులో నుంచి తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన తండావాసులు వెంటనే 108 అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయింది.