- చెల్లితో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదం
జీడిమెట్ల, వెలుగు: చెల్లితో కలిసి ఆడుకుంటున్న చిన్నారి మెడకు చున్నీ చుట్టుకోవడంతో చనిపోయింది. పేట్బషీరాబాద్పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని జీడిమెట్ల డివిజన్ ఏరోనాటికల్ కాలనీకి చెందిన గణేశ్ ప్రైవేట్ఉద్యోగి. ఇతనికి ముగ్గురు కూతుళ్లు. రెండో కూతురు మహాశ్రీ(10), మూడో కూతురు ఆదివారం మధ్యాహ్నం ఆడుకుంటూ ఇంటిపైకి వెళ్లారు.
అక్కడ కిటికీకి కట్టి ఉన్న చున్నీని మహశ్రీ మెడకు చుట్టుకుంది. అక్కకు ఊపిరాడకపోవడాన్ని గమనించిన చెల్లి వెంటనే వెళ్లి తల్లికి చెప్పింది. ఆమె వచ్చి చూసేసరికి పాప స్పహ కోల్పోయింది. వెంటనే హాస్పిటల్కు తరలించగా, అప్పటికే పాప చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.