నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. ఆగస్టు 21న సాయంత్రం డ్రైనేజీలో కొట్టుకుపోయిన చిన్నారి మృతి చెందింది. నిన్నటి నుంచి చిన్నారి ఆచూకీ కోసం గాలించారు. ఉదయం పాప డెడ్ బాడీ దొరికినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
నిజామాబాద్ టౌన్ లోని ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో నిన్న కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీ ఉధృతంగా ప్రవహించింది. ఐతే డ్రైనేజీ సమీపంలో ఆడుకుంటున్న చిన్నారి వరద నీటిలో గల్లంతైంది. పాప ఆచూకీ కోసం పోలీసులు, మున్సిపల్, ఫారెస్ట్ సిబ్బంది ముమ్మరంగా గాలించారు.