రెండేళ్ల చిన్నారి సూట్ కేసులో.. పక్కింట్లోళ్లు ఏం చేశారు

నోయిడాలో దారుణ ఘటన అందరినీ కలవరపెట్టింది. అపార్ట్ మెంట్ లో ఆడుకోవడానికి వెళ్లిన రెండేళ్ళ చిన్నారి.. పక్కింట్లో శవమై కనిపించింది. దాంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. నమ్మికతో ఉంటూనే తమ కుతురును పొట్టన పెట్టుకున్నాడని తల్లిదండ్రులు విలపించాడు. వివరాల్లోకి వెళ్తే..

నోయిడాలో శుక్రవారం (ఏప్రిల్ 7) నాడు.. ఓ చిన్నారి ఆడుకోవడానికి వెళ్లింది. సాయంత్రం అయినా తన ఆచూకి తెలియకపోయే సరికి.. అపార్ట్ మెంట్ అంతా వెతికారు తల్లిదండ్రులు. ఎక్కడా ఆ చిన్నారు జాడ కనిపించకపోయే సరికి.. ఏప్రిల్ 8న పోలీస్ కంప్లైంట్ఇచ్చారు. 

ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. చిన్నారి ఉండే అపార్ట్ మెంట్ అంతా సెర్చ్ చేశారు. అంతలోనే ఓ షాకింగ్ నిజం బయటికి వచ్చింది. పక్కింటి ఓ వ్యక్తి తనను కిన్డాప్ చేసి.. బ్యాగులో దాచి పెట్టాడు. దాంతో ఊపిరాడక ఆ చిన్నారి బ్యాగ్ లోనే మృతి చెందింది. చిన్నారి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్ట్ మార్ట్ కు తరలించారు. హత్యకు పాల్పడ్డ వ్యాక్తిపై కేసు నమోదు చేసి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.