![ఆగ్మెంటెడ్ రియాలిటీతో పని చేసే పిల్లల గ్లోబ్](https://static.v6velugu.com/uploads/2025/02/a-childrens-globe-powered-by-augmented-reality_Ne8U4YZSa6.jpg)
ప్రపంచంలోని ఏ దేశంలో ఏది ప్రత్యేకమైనది? ఎత్తైన కట్టడం ఎక్కడుంది? లోతైన జలపాతం ఏది?.. ఇలాంటి విషయాలన్ని టీచర్లు స్కూల్ పిల్లలకు చెప్తుంటారు. కానీ.. వాటిలో సగం కూడా గుర్తుండవు. ఇలాంటి ఎడ్యుకేషనల్ గ్లోబ్ సాయంతో నేర్పిస్తే.. బాగా గుర్తుంటుంది. దీన్ని షిఫు అనే కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది చూడ్డానికి మామూలు గ్లోబ్లాగే కనిపిస్తున్నా చాలా ప్రత్యేకమైనది. ఫోన్లో ఆర్బాట్ అనే యాప్‌ని ఇన్స్టాల్ చేసుకుని.. దాంతో ఈ గ్లోబ్ మీద స్కాన్ చేయాలి. ఏ ప్లేస్ మీద స్కాన్ చేస్తే.. ఆ ప్లేస్‌లోని వింతలు, విశేషాలు కనిపిస్తాయి.
‘త్రీడీ’ అనే బటన్ మీద క్లిక్ చేస్తే..దానికి సంబంధించిన యానిమేషన్ వీడియో కూడా ప్లే అవుతుంది. ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో పనిచేస్తుంది. 1000 కంటే ఎక్కువ ఫ్యాక్ట్స్, 400 వింతలు ఇందులో ఉన్నాయి. దీంతో విభిన్న సంస్కృతులు, ఆకర్షణీయమైన జంతువులు, ప్రపంచ అద్భుతాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా 4–10 సంవత్సరాల పిల్లలకు ఇది బాగా సరిపోతుంది. ఈ ప్యాక్‌లో పిల్లల కోసం పాస్‌పోర్ట్, స్టాంపులు, దేశాల జెండాల స్టిక్కర్లు కూడా వస్తాయి. ఇది దాదాపు అన్ని ఆండ్రాయిడ్, యాపిల్ డివైజ్‌ల్లో పనిచేస్తుంది. కానీ.. డివైజ్‌లో కనీసం 3జీబీ లేదా అంతకన్న ఎక్కువ ర్యామ్ ఉండాలి.
ధర
1,699