తుపాకీ పొరపాటున పేలి సీఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జవాన్ మృతి

తుపాకీ పొరపాటున పేలి సీఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జవాన్ మృతి
  • బీడీఎల్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో ఘటన

పటాన్​చెరు,వెలుగు : తుపాకీ పొరపాటున పేలి సీఐఎస్ఎఫ్​ జవాన్​ చనిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం భానూర్ ​ పోలీస్​స్టేషన్​ పరిధిలో శనివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా జూనుతుల  గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (37) సీఐఎస్ఎఫ్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఏడాది కింద బీడీఎల్  పరిశ్రమకు బదిలీపై వచ్చాడు. సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆయన శనివారం ఉదయం పరిశ్రమలోని

వాచ్ టవర్ లో డ్యూటీ ముగించుకున్నాడు. సీఐఎస్ఎఫ్  యూనిట్  బ్యారక్ లైన్ లో బస్సు దిగుతుండగా చేతిలో ఉన్న  రైఫిల్ పొరపాటున పేలింది. గన్ లోని బుల్లెట్ తలలోకి దూసుకెళ్లడంతో స్వామిగౌడ్  తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించేలోపే ఆయన చనిపోయాడు.