- 4 ఎంపీ స్థానాల పరిధిలో రూపొందించిన రెసిడెంట్వెల్ఫేర్ అసోసియేషన్స్
- ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా పరిష్కరించాలని వినతి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని ప్రధాన సమస్యలను తెలుసుకుని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్(ఆర్డబ్ల్యూఏ) బుధవారం ‘సిటిజన్స్మేనిఫెస్టో’ను రిలీజ్చేసింది. ఏ పార్టీ అభ్యర్థి నెగ్గినా ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరింది. ఇందులో ప్రధానంగా జీఓ111 అమలు, వరద నీరు పోటెత్తకుండా శాశ్వత పరిష్కారం, రోడ్ల విస్తరణ, కంటోన్మెంట్ విలీనం, ఎంఎంటీఎస్ పొడిగింపు, అంతరాయం లేని విద్యుత్ సరఫరా, గవర్నమెంట్హాస్పిటల్స్, స్కూల్స్ లో కనీస వసతులు, డ్రగ్స్, గ్యాంబ్లింగ్, భూ ఆక్రమణలకు అడ్డుకట్ట అంశాలు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని 4 వేలకు పైగా ఉన్న రెసిడెంట్వెల్ఫేర్ అసోషియేషన్లన్నీ కలిసి ఈ మేనిఫెస్టోని తయారుచేశాయి. సిటిజన్స్మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర నాయకులకు అందజేశామని ఆర్ డబ్ల్యూఏ సెక్రెటరీ టీబీ శ్రీనివాస్ వెల్లడించారు.