మద్యం మత్తులో పొట్టు పొట్టు కొట్టుకున్నారు

ఖమ్మం నగరంలో పోకిరీలు రెచ్చిపోయారు. రఘునాథపాలెంలోని ఓ మద్యం దుకాణం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. మద్యం మత్తులో కర్రలతో దాడులు చేసుకున్నారు. సీసాలు పగలగొట్టి మరి కొట్లాడుకున్నారు. అక్కడున్న వారిపై కూడా దాడి చేశారు. మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వారు ఈ గొడవను చూసి కొందరు భయంతో పరుగులు తీశారు. ప్రధాన రహదారి మీదకు వచ్చి వాహనాలను ఆపి ఘర్షణ పడ్డారు.

ALSO READ :వాతావరణంలో పొరలు.. చదివేయండి మరి

ఈ ఘటనలో పెద్దతండాకు చెందిన తేజావత్ రమేష్ అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. రమేష్ ఫిర్యాదు మేరకు గోపాలపురానికి చెందిన బాదావత్ ప్రవీణ్, దుగ్గి వేణు, వలపులేని విజయ్ కుమార్, లింగాల నవీన్ కుమార్, విజయ్ అనే వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.