హుజూరాబాద్ బీఆర్ఎస్ నేతల్లో బయటపడ్డ వర్గపోరు.. కౌశిక్ సాక్షిగా నేతల ఘర్షణ

హుజూరాబాద్ బీఆర్ఎస్ నేతల్లో బయటపడ్డ వర్గపోరు.. కౌశిక్ సాక్షిగా నేతల ఘర్షణ

హనుమకొండ జిల్లా : హుజూరాబాద్ బీఆర్ఎస్  నాయకుల్లో వర్గపోరు బయటపడింది. కమలాపూర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నాయకులు మధ్య ఉన్న వర్గ విబేధాలు బయటపడ్డాయి. బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఎదురుగా కొందరు నాయకులు ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకున్నారు. ఒక వర్గంపై మరో వర్గం విమర్శలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. పరస్పరం ఒకరిపై మరొకరు కుర్చీలు, చెప్పులు విసురుకున్నారు. దీంతో అసహనంతో మీటింగ్ నుండి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వెళ్లిపోయారు. పార్టీలో ఇబ్బంది ఉన్నవాళ్లు బయటికి వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇదే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది.