- వెలుగు కథనానికి స్పందన
- టీచర్ ను నియమించిన అధికారులు
కుభీర్,వెలుగు : కుభీర్ మండలంలోని దావుజీ నాయక్ తండా ప్రైమరీ స్కూల్ లో టీచర్ లేకపోవడంతో గత రెండు నెలలుగా తాళం వేసి ఉంది. ఈ నేపథ్యంలోనే ‘విద్యార్థులు ఉన్న.. టీచర్ లేక మూతపడ్డ స్కూల్’ అనే శీర్షికతో సోమవారం ‘వెలుగు’ దినపత్రికలో వచ్చిన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఎంఈవో విజయ్ కుమార్ సోమవారం స్కూల్‌ను సందర్శించి స్కూల్ తాళం తెరిచారు. కొత్తగా టీచర్‌ను నియమించినట్లు చెప్పారు. ఇకనుంచి ప్రతిరోజు టీచర్ స్కూల్ కి వస్తారని, విద్యార్థులు వచ్చి చదువుకోవాలని సూచించారు.
మూసి ఉన్న స్కూల్‌ను పరిశీలించిన డీఈవో
కడెం, వెలుగు : కడెం మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన పాండవాపూర్ తండాలో మూసిఉన్న ప్రైమరీ స్కూల్‌ను సోమవారం డీఈవో రవీందర్ రెడ్డి పరిశీలించారు. ఆదివారం ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేశ్ నాయక్ స్కూల్ మూసివేసిన విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు. స్కూల్‌వద్దకు చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. రెండ్రోజుల్లో టీచర్‌ను నియమిస్తామని వారికి హామీ ఇచ్చారు.