- షాపు తెరవడం లేదని మహిళల ధర్నా
- షాపు యజమానులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లోని ఓ దుస్తుల దుకాణం ‘రూపాయికే చీర.. ఒక్కరోజే ఆఫర్’ అంటూ చేసిన ప్రచారం ఉద్రిక్తతకు దారి తీసింది. వారం రోజులుగా భద్రాచలం చుట్టు పక్కల గ్రామాల్లో పాంప్లేట్స్, మైకుల ద్వారా ప్రచారం చేయడంతో మంగళవారం ఆ షాపు వద్దకు మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
షాపు ఓపెన్ చేసిన వెంటనే మహిళలు ఒక్కసారిగా లోనికి వెళ్లారు. దీంతో షాపు యాజమాన్యం వారిని బయటికి పంపి షాప్ బంద్ పెట్టింది. షాపు తెరువాలని అక్కడే మహిళలు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని షాపు యజమానులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం మహిళలు ఇండ్లకు వెళ్లిపోయారు.