మహానంది ఆలయంలో అద్భుతం.. ముఖద్వారంలో నాగుపాము ప్రత్యక్షం

మహానంది ఆలయంలో అద్భుతం.. ముఖద్వారంలో నాగుపాము ప్రత్యక్షం

ప్రముఖ పుణ్యక్షేతం మహానంది ఆలయంలో అద్భుతం జరిగింది. ఆవు రూపంలో సాక్ష్యాత్తూ వెలిసిన మహా పరమేశ్వరుడి ఆలయంలో నాగు పాము ప్రత్యక్షమైంది. ఎప్పుడు శివుడి మెడలో కనిపించే నాగుపాము ఆలయంలో ప్రత్యక్షం కావడంతో భక్తులు సాక్ష్యాత్తూ పరమేశ్వరుడే అంటూ మొక్కారు. వివరాల ప్రకారం.. మహానంది ప్రాంగణంలోనిసుపథంమండపంలో గురువారం (ఫిబ్రవరి 6) రాత్రి నాగుపాము ప్రత్యక్షమైంది.

 ఆలయ రాజగోపురం ముందు భాగంలో ఉన్న సుపథం మండపాల ప్రాంగణంలో భక్తులు సేద తీరుతూ ఉంటారు. మండపంలో నాగుపాము కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురికాగా స్థానిక యువకులు వెంటనే అయ్యన్న నగర్ గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ మోహన్‌కు సమాచారం ఇచ్చారు. అతడు ఆలయం వద్దకు చేరుకుని పామును పట్టుకుని సమీపంలోని నల్లమల అడవిలో వదిలేశారు.

భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. మరికొందరు మాత్రం పరమేశ్వరుడే అంటూ నాగుపామును మొక్కారు. మహానంది ఆలయం మండపంలో పాము వచ్చిన వీడియోను కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి.