బిర్యానీలో బొద్దింక!

బిర్యానీలో బొద్దింక!

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం మమత రోడ్డులోని ఓ హోటల్  లో కస్టమర్లు గురునాధం, బోస్ బిర్యానీ తింటుండగా ప్లేట్ లో బొద్దింక వచ్చింది. వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారి కిరణ్ కుమార్ కు ఫోన్​ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఆఫీసర్లు హోటల్ కు వచ్చి ఫుడ్ లోని బొద్దింకను, కిచన్ ను, ఆహార పదార్థాలను పరిశీలించారు. బొద్దింక వచ్చిన బిర్యానీ శాంపిల్ తీసుకుని ల్యాబ్ కు పంపిస్తామని, రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.