
ఆదిలాబాద్ టౌన్/జైపూర్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణం పంజాబ్ చౌక్ లోని చైతన్య విత్తన దుకాణాన్ని కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణ యజమానితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. రైతులతో మాట్లాడి ఇబ్బంల్లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
ఫర్టి లైజర్స్ షాపుల్లో తనిఖీలు
జైపూర్ మండలంలోని పలు ఫర్టిలైజర్ షాపులను శనివారం ఎస్ఐ శ్రీధర్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మార్క్ గ్లాడ్ కలిసి రెవెన్యూ, టాస్క్ ఫోర్స్ టీం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా షాపుల సర్టిఫికెట్లు, లైసెన్స్, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. గోడౌన్లు, గ్లైఫో సెట్ గడ్డి మందు నిల్వలపై ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే అమ్మాలని, విత్తనాలు కొన్న రైతులకు బిల్లులు అందచేయాలని సూచించారు. గడువు ముగిసిన విత్తనాలు, పురుగు మందులు అమ్మొద్దని ఆదేశించారు.