ఏపీ ప్రభుత్వంతో చర్చలకు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో కమిటీ

  • మీడియా సమావేశంలో నిర్మాత దిల్ రాజు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో చర్చలు జరిపేందుకు ఫిల్మ్ చాంబర్ ఆధ్వర్యంలో కమిటీ వేశామని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. త్వరలోనే కమిటీ సభ్యుల వివరాలు ప్రకటిస్తామని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. సినీ పరిశ్రమ నుంచి కమిటీలో సభ్యులుగా నియమితులైన వారు అమరావతి వెళ్లి చర్చల్లో పాల్గొంటారని.. తొందర్లోనే ఈ భేటీ జరిగే అవకాశం ఉందన్నారు.  ఏపీ ప్రభుత్వంతో కమిటీ చర్చించిన తరువాత మంచి సందేశం వస్తుందనే అశాభావం ఉందన్నారు. 
ఒకవేళ కమిటీ చర్చల్లో పురోగతి లేకపోతే పరిశ్రమలోని వివిధ విభాగాల ప్రతినిధులంతా కూర్చుని మాట్లాడుకుందమని.. ప్రభుత్వంతో చర్చలు జరిగే వరకూ ఏవరు మాట్లాడొద్దని ఆయన సూచించారు. అదేవిధంగా టికెట్ ధరలు పెంచుకునేందు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వాని ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు అపాయింట్ మెంట్ ఇస్తే కలుస్తామని స్పష్టం చేశారు. ఏపీలో సినిమా థియేటర్ల అంశంపై మీడియా సమన్వయం పాటించాలని దిల్ రాజు కోరారు. 

 

ఇవి కూడా చదవండి:

సినిమా థియేటర్లు మూసేస్తుంటే ఏడుపొస్తోంది

రాజకీయ నిరుద్యోగులంతా ఒకరోజు దీక్ష చేస్తున్నారు