సాధారణ రైతు కొడుకు నేడు ఉపరాష్ట్రపతి: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

సాధారణ రైతు కొడుకు నేడు ఉపరాష్ట్రపతి: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

ఢిల్లీ: ఓ సాధారణ రైతు కొడుకు నేడు భారత ఉప రాష్ట్రపతి అయ్యారని కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ కొనియాడారు. రాజ్యసభ చైర్మన్ గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఒకనాడు  టీ అమ్మిన వ్యక్తి నేడు భారత ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. సాధారణ నేపథ్యాలు ఉన్న వ్యక్తులు నేడు దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నారని మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. 

 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ సాధారణ ఉపాధ్యాయురాలని.. ఒడిశా లోని ఓ చిన్న పాఠశాల నుంచి నేడు భారత రాష్ట్రపతి పదవి  చేపట్టారని పీయూష్ గోయల్ తెలిపారు. ఆ తర్వాత స్పందించిన రాజ్యసభ చైర్మన్ ధన్ కడ్ ప్రస్తుతం మనం అమృత కాలంలో ఉన్నామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదని తెలిపారు. దేశ చట్టసభల్లో అనుభవజ్ఞులు, అపారమైన జ్ఞానం ఉన్న వ్యక్తులు ఉన్నారని కొనియాడారు.