హైదరాబాద్ కూకట్పల్లిలో రెండు స్కీముల పేరిట 12 కోట్లకు ముంచేసిన కంపెనీ

హైదరాబాద్ కూకట్పల్లిలో రెండు స్కీముల పేరిట 12 కోట్లకు ముంచేసిన కంపెనీ

స్కీం ల పేరిట జరుగుతున్న స్కాం లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పేద మధ్య తరగతి ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని లాభాల ఆశ చూపించి మోసాలకు పాల్పడుతున్నవారు పెరుగుతూనే ఉన్నారు. చైన్ సిస్టమ్ లో డబ్బులు వసూలు చేసి కోట్లలో పోగయ్యాక బోర్డు తిప్పే్స్తున్నాయి కంపెనీలు. 

తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో స్కాం బయటపడింది. బై బ్యాక్ స్కీం పేరుతో 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది వి ఓన్ ఇన్ఫ్రా (we own infra) గ్రూప్. మొత్తం 90 మంది బాధితుల దగ్గర నుండి 12 కోట్లు వసూలు చేశారు. 

Also Read:-బెంగళూరులో బతుకుడు కష్టమే..
 
కూకట్ పల్లి కేంద్రంగా నడుస్తున్న ఈ కంపెనీ సడెన్ గా బోర్డు తిప్పేయడంతో డబ్బులు పెట్టిన అమాయకులు రోడ్డుపైన పడ్డారు. రెండు స్కీముల పేరిట బాధితులను ముంచేసింది కంపెనీ. కంపెనీ మూసేయడంతో 25 మంది బాధితులు సైబరాబాద్ EOW పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో వెంకటేష్,  వంశీకృష్ణ అనే ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేశారు.  కీలక సూత్రధారి సురేష్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.