హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుంది. డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమై నది. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకండి' అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క అధికారులను ఆదేశించారు. ఇవాళ ఉదయం ఆయన జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి సమగ్ర కుటుంబ సర్వే వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లుకు పలు సూచనలు చేశారు. సర్వేదశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపో వడం వంటి కొన్ని సమస్యలు తలెత్తా యన్నారు.
కాబట్టి వారికి ఫోన్ కాల్ చేసి సర్వే గురించి తెలియజేయడం ద్వారా ఆ వివరాలను క్రమబద్ధీకరించుకోవాలని, వారిని అందు బాటులో ఉండమని కోరాలని ఆదేశించారు. కొన్ని వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయన్నారు. ఈ పాఠశాలలో ఆహారం, పరిశుభ్రతపై ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యావత్ క్యాబినెట్ ప్రత్యేక దృష్టికి సాధించిందని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫుడ్ పాయిజన్, అపరిశుభ్రత వంటి అంశాలకు తావు లేకుండా కార్యాచరణ. ప్రణాళిక రూపొందిం చడానికి సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.