డబుల్ బెడ్ రూమ్ ​ఇండ్ల వద్ద ఆందోళన

కామారెడ్డి, వెలుగు:  ఇండ్ల పట్టాలు, కరెంట్​కనెక్షన్ ఇవ్వాలంటూ కామారెడ్డిలోని డ్రైవర్స్​ కాలనీలో  డబుల్ బెడ్​రూమ్ ​ఇండ్ల వద్ద శనివారం లబ్ధిదారులు ఆందోళన చేశారు. ​కరెంట్​కనెక్షన్​ పేరుతో స్థానిక బీఆర్ఎస్​ లీడర్​ ఆసీఫ్​ ఇంటికి రూ.వెయ్యి చొప్పున పైసలు వసూలు చేశాడని ఆరోపించారు. తమకు ఇండ్లు కేటాయించి మూడు నెలలు కావొస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. ఆఫీసర్లు సైతం పట్టించుకోవడం లేదన్నారు. 

పోలీసులు చేరుకొని సముదాయించారు. కరెంట్​కనెక్షన్​ కోసం పైసలు వసూలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో శాంతించారు.